Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సూపర్ 30' వ్యవస్థాపకుడికి అమెరికా వర్సీటీల రెడ్ కార్పెట్!

ఆనంద్ కుమార్... పాట్నాకు చెందిన 46 ఏళ్ల నడి వయస్కుడు. విద్యార్థిగా ఉండగా, కేంబ్రిడ్జి వర్సీటీలో చదవాలని నిత్యం కలలు కనేవాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతడి కలలను కల్లలు చేశాయి. స్వదేశీ విద్యతోనే సరిపెట్టుకున్నాడు. విద్యాభ్యాసం తర్వాత ‘సూపర్ 30’ పేరిట పాట్నాలో ఓ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశాడు. విద్యలో అంతంతమాత్రంగా రాణిస్తున్న ఓ 30 మంది పేద పిల్లలను గుర్తించాడు. ఏడాది పాటుగా ఉచిత కోచింగ్ అందించాడు. బస కూడా ఉచితంగానే ఏర్పాటు చేశాడు. అంతే, ఆ పిల్లలు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాలయాలు ఐఐటీ సీట్లను కొల్లగొట్టారు. ఈ విజయంతో ఒక్కసారిగా ఆనంద్ కుమార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. 1997లో మొదలైన ఈ యజ్ఞం నేటికీ అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఆనంద్ కుమార్ ప్రతిభను గుర్తించిన అమెరికా ప్రతిష్ఠాత్మక వర్సిటీలు మాసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ విశ్వ విద్యాలయాలు ఆనంద్ కుమార్ కు ఆహ్వానాలు పంపాయి. ఎందుకో తెలుసా, పేదరికంలో మగ్గుతున్న విద్యార్థులను ఐఐటీయన్లుగా మార్చిన వైనాన్ని తమ విద్యార్థులకు వివరించేందుకట. చదివేందుకు అమెరికా వెళ్లాలనుకున్న ఆనంద్ కుమార్ చదువు చెప్పేందుకు వెళుతుండటం, నిజంగా గ్రేట్ కదా!

More Telugu News